Oct 17,2022 23:06

మీల్స్‌ విభాగంలో ప్ర్రచారం నిర్వహిస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ త్రిఫ్ట్‌ సొసైటీ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ మీల్స్‌ విభాగంలోని డబ్ల్యూఆర్‌ఎం 1,2 రోల్‌ షాప్‌, ఎంఎంఎస్‌ఎం విభాగంలో సిఐటియు నాయకులు ప్రచారం చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ సిఐటియూ అధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ వివిధ విభాగాల్లో కార్మికులతో మాట్లాడి త్రిఫ్ట్‌ ఎన్నికలలో సిఐటియు ప్యానల్‌కు మదతు ఇవ్వాలని కోరారు. పారదర్శకతతో అందించిన సేవలు వల్లే స్టీల్‌ప్లాంట్‌ త్రిఫ్ట్‌ సొసైటీ రాష్ట్రంలోనే ఉత్తమమైందిగా నిలిచిందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సొసైటీలు మూతబడినప్పటికీ స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయిస్‌ త్రిఫ్ట్‌ సొసైటీ లాభాల బాటలో దూసుకుపోతుందంటే గడచిన ఐదుసార్లు సేవలందించిన సిఐటియు ప్యానెల్‌ కారణమన్నారు. భవిష్యత్తులో కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవడానికి, మరోసారి సిఐటియు ప్యానల్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యు వెంకటేశ్వర్లు, మధుసూదన్‌, వి.మురళి, బాలశౌరి, డిఎం.కృష్ణ, కెఆర్‌కె రాజు, రామ మోహన్‌, అప్పలరాజు, ముని వెంకటరమణ పాల్గొన్నారు.