
ప్రజాశక్తి-గుడివాడ : త్రిపురనేని గోపీచంద్ రచనలు సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉండేవని మునిసిపల్ కమిషనర్ వి.మురళీకృష్ణ అన్నారు. గుర ువారం స్థానిక షా గులాబ్‌చంద్ ప్రథమశ్రేణి గ్రంథాల యంలో తెలుగుభాషా వికాస సమితి ఆధ్వర్యంలో త్రిపురనేని గోపీచంద్ 113వ జయంతి ఘనంగా నిర్వహించారు. తొలుత పలువురు త్రిపురనేని గోపీచంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన కార్యదర్శి డా.జి.వి.పూర్ణచంద్‌కు త్రిపురనేని గోపిచంద్ స్మారక పురస్కారం-2023ను అందించారు. ఈ సందర్బంగా తెలుగుబాషా వికాస సమితి అధ్యక్షులు డిఆర్‌బి ప్రసాద్ మాట్లాడుతూ సమాజానికి ఎంతో మేలు కలిగించే రచనలు చేసిన త్రిపురనేని జయంతిని తెలుగు భాషా వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గుత్తికొండ సుబ్బారావు, చింతపల్లి వెంకటరమణ, భవిరి శంకర్‌నాథ్, మోకా మాధవరావు, గాదె మోహన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.