
వేంపల్లె : ఆర్‌జియుకెటి పరిధి లోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో మంగళవారం కడప జిల్లా లింగాల మండలానికి చెందిన గంగా రామ్(20)అనే విద్యార్థి ఫ్యాన్‌కు ఊరి వేసుకొని ఆత్మహత్య చేసు కున్నారు. లింగాల మండలంలోని తేర్నంపల్లెకు చెందిన గంగాధర్, నారాయణమ్మ కుమారుడు గంగారామ్, గౌరి శంకర్ అనే ఇరువురు కుమారులు ఉన్నారు. గంగాధర్ ట్రాక్టర్ డ్క్రెవర్‌గా పని చేస్తూ ఇద్దరూ పిల్లలను చదివించుకొంటున్నాడు. పదవ తరగతిలో మంచి మార్కులను గంగారామ్ సాధించడంతో ట్రిపుల్‌ఐటిలో 2019-20 విద్యా సంవ త్సరంలో సీటు వచ్చింది. ప్రస్తుతం సివిల్ విభాగంలో (ఇ-3) మూడవ సంవత్సరం విద్యాభ్యాసం చేస్తున్న గంగారామ్‌కు గ్రౌండ్ ఫ్లోర్ 101 గదిని కేటాయించారు. చదువులో చురుకుగా ఉన్న విద్యార్థి గంగరామ్ ఎవరూ లేని సమయంలో గదిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసు కున్నాడు. గదికి తలుపులు వేసి ఉండడంతో తోటి విద్యార్థులు తలుపులు కొట్టినా, పిలిచినా గంగారామ్ నుండి స్పందన రాకపో వడంతో తోటి విద్యార్థులు ట్రిపుల్‌ఐటి అధికారులకు సమాచారం అందించారు. హుటాహుటిన అధికారులు, సిబ్బంది విద్యార్థి గది వద్దకు వెళ్లి తలుపులను పగుల కొట్టి లోపలికి వెళ్లగా ఫ్యాన్‌కు గంగారామ్ ఊరి వేసుకొని ఉన్న విషయం బయట పడింది. విద్యార్థి తల్లిదండ్రులైన గంగాధర్, నారాయణమ్మలకు సమాచారం ఇచ్చారు. రోజూ ఇంటికి ఫోన్ చేసి మాట్లాడేవాడని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిం చారు. మృతి చెందిన గంగరామ్ మృతదేహాన్ని ట్రిపుల్‌ఐటి క్యాపస్ నుండి వేంపల్లె ఆసుపత్రికి ట్రిపుల్‌ఐటి డైరెక్టర్ సంధ్యారాణి, ఒఎస్‌డి గంగిరెడ్డి, సిబ్బంది తరలించారు. సిఐ గోవింద్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గంగారామ్ ఆత్మహత్యపై విద్యార్థులతో విమృతి చెందిన విద్యార్థి గంగారామ్‌వరాలు అడిగి తెలుసుకున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.