Sep 09,2023 00:47

ప్రజాశక్తి - అద్దంకి
తరచుగా విద్యుత్ అంతరాయం జరుగుతున్న నేపథ్యంలో సబ్ ట్రెజరీ కార్యాలయ సిబ్బంది ఇబ్బందులను గమనించిన ఆంధ్ర ప్రదేశ్ విశ్రాంత ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల సంఘం అద్దంకి కార్యదర్శి టి కృష్ణయ్య, లక్కరాజు చంద్ర శేఖర్ తమ సంఘంతో సంప్రదించి రూ.24వేల విలువైన ఇన్వర్టర్‌ను సబ్ ట్రజరీ ఆఫీసర్ కె లక్ష్మీ ప్రసన్నకు అందచేశారు. సబ్ ట్రజరీ ఆఫీసర్ మాట్లాడుతూ దాతల సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు మరింత మెరుగైన సేవలు అందచేస్తానని అన్నారు. కార్య క్రమంలో  విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షేక్ మస్తానరావు, అసోసియేట్ అధ్యక్షుడు పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, కొప్పరపు అశ్వత్థ నారాయణ, లక్కరాజు చంద్ర శేఖర్, షేక్ ఎస్‌జి సైదా, మారం కోటేశ్వరరావు, కె కొండలరావు, పి సునీత, కె శ్రీనివాసులు, వామరాజు వెంకటేశ్వర్లు, లక్కరాజు శ్రీనివాసరావు, కెవి పోలిరెడ్డి పాల్గొన్నారు.