Sep 28,2023 22:36

ప్రజాశక్తి - కాళ్ల
            గణేశ్న భాను శ్రీలక్ష్మీఅన్నపూర్ణ ప్రత్యూష గ్రూపు-1 పరీక్షల్లో తొలి ర్యాంకు సాధించి ఏలూరు జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులై స్వగ్రామమైన సీసలి గురువారం ఇచ్చేశారు. ఆమె తొలుత సీసలి సాయిబాబా ఆలయాన్ని దర్శించుకున్నారు. ట్రైని డిప్యూటీ కలెక్టర్‌ ప్రత్యూషకు ఆలయ మర్యాదలతో ఆలయ అర్చకులు, ఛైర్మన్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయిబాబా ఆలయం వద్ద గ్రామస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గ్రామమంతటా కారులో ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ట్రైని డిప్యూటీ కలెక్టర్‌ ఇంటి వద్ద గ్రామస్తులు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచి కట్రేడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిరంతర శ్రమతోనే ప్రత్యూష ట్రైని డిప్యూటీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రత్యూష మాట్లాడుతూ పటిష్టమైన పునాది.. మనపై మనకు నమ్మకం ఉంటే ఎంతటి లక్ష్యాన్ని అయినా సులువుగా సాధించవచ్చన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా తన తండ్రి ప్రోత్సహించారన్నారు. భవిష్యత్తులో సివిల్స్‌కు ప్రయత్నిస్తా నన్నారు. ఈ కార్యక్రమంలో గణేశ్న వెంకట రామాంజనేయులు, గణేశ్న ఉష, తోట వెంకయ్య, మాజీ ఎంపిటిసి కట్రేడ్డి విజయలక్ష్మి, గణేశ్న పద్మారావు, నల్ల శ్రీను, గణేశ్న వెంకట రామకృష్ణ, గ్రామ సర్పంచి బిల్లకుర్తి ధనలక్ష్మి శ్రీనివాస్‌, తోట ఫణిబాబు, తోట హరిబాబు, మాజీ ఎంపిపి ఆరేటి వెంకటరత్నప్రసాద్‌, కోరా రామ్మూర్తి, జివి.నాగేశ్వరరావు, ఎరుబండి రామాంజనేయులు, వాస్కూరి శ్రీనివాసు పాల్గొన్నారు.