Apr 17,2023 23:57

ఆర్‌డిఒకు సమస్యను వివరిస్తున్న కోరాడ రాజబాబు

ప్రజాశక్తి -ఆనందపురం : ఆనందపురం మండలం వేములవలస కూడలిలో నేషనల్‌ హైవే నిర్మించిన రోడ్డు, వంఎతన వల్ల స్థానికంగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం ఆర్‌డిఒ భాస్కర్‌రెడ్డి పరిశీలించారు. ట్రాఫిక్‌ నివారణ చర్యలు, వ్యాపారస్తుల సమస్యలపై తహశీల్దార్‌ రామారావు, స్థానిక నాయకులు కోరాడ రాజబాబుతో పాటు పలు సంఘా నాయకులతో చర్చించారు. త్వరలో సరైన మార్గాలతో ట్రాఫిక్‌ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. చిరు వ్యాపారులు వ్యాపారాలను కొనసాగించుకోవడానికి వీలుగా కూడలిలో స్థలా కేటాయించాలని, రోడ్డుకిరువైపులా సిమెంట్‌ కాలువలు ఏర్పాటుచేయాలని, సర్వీస్‌ రోడ్డును వెల్లంకి వరకు కలపాలని, రోలింగ్‌ బస్సు కాంప్లెక్స్‌ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని భీమిలి నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కోరాడ రాజబాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో సంఘం నాయకులు, వ్యాపారస్తులు, చిరు వర్తకులు పాల్గొన్నారు.