కారుషెడ్ వద్ద ట్రాఫిక్ సమస్యలపై సూచనలు చేస్తున్న పోలీసు అధికారులు
ప్రజాశక్తి -మధురవాడ, పిఎం.పాలెం : ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు ట్రాఫిక్ ఎడిసిపి అరిఫుల్లా పేర్కొన్నారు. జాతీయ రహదారిపై కారుషెడ్డు కూడలి వద్ద జోన్ 1 ట్రాఫిక్ ఎసిపి కుమార్ స్వామితో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రద్దీ సమయంలో కారు షెడ్ కూడలి, క్రికెట్ స్టేడియం, కొమ్మాది కూడలి వద్ద తీసుకోవాల్సిన జాగత్తలపై పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో ట్రాఫిక్ సిఐ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.










