Nov 21,2023 00:38

ప్రజాశక్తి - అద్దంకి
పట్టణంలో ప్రధానంగా ట్రాఫిక్ సమస్య ఉందని, ఆ సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని సిఐ బి రమేష్ బాబు తెలిపారు. తన కార్యాలయంలో విలేకర్లతో సోమవారం మాట్లాడారు. మెయిన్ రోడ్, నామ్ రోడ్, ఏస్బిఐ బ్యాంక్ రోడ్, ఆయిల్ మిల్ రోడ్, బంగ్లా రోడ్లలో వాహన రాకపోకలతో ప్రధాన సమస్యగా ఉందని అన్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను అది గమించడానికి ఉదయం 8గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9గంటల వరకు ప్రత్యేక పోలీస్ నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. పోలీసులకు వాహన చోదకులు, వ్యాపారులు సహకారం అందించాలని కోరారు. వ్యాపారులు తమ వ్యాపార నిమిత్తం వచ్చే వాహనాలను పోలీసులు నిర్ణయించిన సమయంలో అన్ లోడ్ ఇన్ లోడ్ చేసుకోవాలని కోరారు. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలున్న ప్రాంతాల్లో పోలీసు నిఘా ఉందని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ఆతకాయలు తిరుగుతూ ద్విచక్రవాహనాల్లో డబుల్, ట్రిబుల్ రైడింగ్ చేస్తూ ఉంటే చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆడపిల్లల జోలికి వెళితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.