Aug 02,2023 16:34

మీడియాతో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి పై చర్యలు
మైనర్లకు, లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇస్తే యజమానుదారులకు శిక్షలు - జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి  
ప్రజాశక్తి నంద్యాల కలెక్టరేట్

      మైనర్లకు  లైసెన్స్ లేనివారికి ఏదైనా వాహనం (మోటార్ సైకల్ ,కారు ) మరి ఏ ఇతర వాహనం నడపడానికి ఇస్తే ఒకవేళ సదరు వాహనం వల్ల  ఏదైనా ప్రమాదం జరిగి ఎవరి మరణానికి కారణమైతే సదరు వాహనం ఇచ్చిన యజమాని తల్లిదండ్రులు గార్డియన్ లపై 304 ఐపీసీ క్రింద  ఏదైయన గాయాలకు కారణమైతే సదరు వాహనం ఇచ్చిన యజమాని తల్లిదండ్రులు గార్డియన్ లపై 308 ఐపీసీ క్రింద కేసులు నమోదు చెయ్యబడతాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.304 ఐపీసీ క్రింద 10 సంవత్సరాలు,308 ఐపీసీ క్రింద 7 సంవత్సరాలు శిక్షార్హులౌతారన్నారు.కావున  మైనర్లకు  లైసెన్స్ లేని వారికి వాహనాలు ఇవ్వరాదని హెచ్చరించారు.రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన చేసేలా చర్యలు చేపట్టాలని, జరిమానాల కంటే అవగాహన కల్పించడం ముఖ్యమని,జిల్లా పోలీసు యంత్రాంగం సమిష్టిగా కృషి చేసి రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలని జిల్లా ఎస్పీ  రఘువీర్ రెడ్డి  పోలీస్ సిబ్బందికి సూచించారు. జూలై  నెలలో జిల్లా వ్యాప్తంగా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్  లో  భాగంగా  ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై పోలీసులు తీసుకున్న చర్యల వివరాలను నమోదైన కేసుల వివరాల ను జిల్లా ఎస్పీ బుధవారం పత్రికలకు విడుదల చేశారు . అందులో ప్రధానంగా వాహనాలు నడిపేటప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు లేని వారిపై 830  కేసులు.హెల్మెట్ ధరించ కుండా ద్విచక్ర వాహనాలు నడిపిన చోదకులపై 2,271  కేసులు,  మైనర్ల పై 69 కేసులు.  వన్ వే లో రాంగ్ రూట్  వెళ్ళిన వారిపై 12 కేసులు. మొబైల్ మాట్లాడుతూ వాహనం నడిపిన వారి పై  560  కేసులు. జంపింగ్ సిగ్నల్  45  కేసులు. ఏలాంటి రికార్డులు పత్రాలు లేకుండా వాహనాలు నడిపిన వారి పై 1309కేసులు. సీటు బెల్టు ధరించకుండా వెళ్తున్న కార్లు , జీపులు , తదితర వాహన చోదకుల పై 158  కేసులు. అతి వేగంతో వెళ్లి న వాహనాల పై 85 కేసులు. ఓవర్ లోడ్ తో వెళ్ళిన వాహనాల పై మోటారు వాహనాల చట్టం కింద 44 కేసులు. త్రిబుల్ రైడింగ్ పై  1774  మంది కేసులు. రాంగ్ పార్కింగ్ చేసిన ద్విచక్రవాహానాల పై  2965 కేసులు. రాంగ్ పార్కింగ్ చేసిన త్రీ వీలర్ మరియు ఫోర్ వీలర్ వాహానాల పై  1516  కేసులు. డ్రంకెన్ & డైవింగ్ పై 404 కేసులు నమోదు అయ్యాయాన్నారు.మొత్తం 4 లక్షల 86 వేల 814  ఈ – చలనాలు పెండింగ్ లో ఉన్నాయని గత నెలలో  1011 ఈ – చలనాలను (రూ.2 లక్ష 66 వేల 885 రూపాయలను)  రికవరీ చేశామన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరిగినా , రహదారులపై ఇబ్బందికరంగా వాహనాలు నిలిపినా వెంటనే డయల్ 100 కు సమాచారం చేర వేయాలని జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని  జిల్లా ఎస్పీ  విజ్ఞప్తి చేశారు.