Nov 18,2023 00:23

ప్రజాశక్తి - చీరాల
ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఇస్తా రీతిగా వ్యవహరిస్తే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తప్పవని ట్రైనీ డిఎస్పి దివ్యశ్రీ హెచ్చరించారు. పట్టణంలోని ఆటో డ్రైవర్లతో నూతన ట్రాఫిక్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఎన్ గోపి శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణకు ఆటో డ్రైవర్లు సహకరించాలని అన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలన్నారు. ఆటో డ్రైవర్ వివరాలను ఆటోలో డిస్‌ప్లే చేయాలని సూచించారు. పట్టణంలో వాహన రద్దీ అధికంగా ఉంటుందని అన్నారు. కావున ఆటోలు ఎక్కడపడితే అక్కడ నిలపవద్దని చెప్పారు. ట్రాఫిక్‌ జాగ్రతలు పాటించాలని అన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ సల్మాన్ రాజు, సిబ్బంది పాల్గన్నారు.