ప్రజాశక్తి-నర్సీపట్నంటౌన్:ట్రాఫిక్ నిబంధనలపై నర్సీపట్నంలో పట్టణ, రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున అవగాహన ర్యాలీ నిర్వహించారు. నర్సీపట్నం ఇన్చార్జి డిఎస్పి కే.ప్రవీణ్ కుమార్ ప్రారంభించిన ఈ ర్యాలీలో సుమారు 500 మంది వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణ సీఐ నమ్మి గణేష్, రూరల్ సీఐ రమణయ్యలు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహన చోదకులను ఆపి రహదారి భద్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్‌పి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, హెల్మెట్, సీట్ బెల్ట్‌లను వాహనదారులు ఉపయోగించాలని సూచించారు. పట్టణ సీఐ నమ్మి గణేష్ మాట్లాడుతూ, హెల్మెట్ ధరించకపోవడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆయన అన్నారు.అనంతరం ఆబిద్ సెంటర్‌లో మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ రూరల్ ఎస్సైలు గోవిందరావు, ధనుంజయ నాయుడు, రామారావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.










