Apr 29,2023 00:27

సమావేశంలో పాల్గొన్న కలెక్టర్‌, ఎస్‌పి తదితరులు

ప్రజాశక్తి-అనకాపల్లి
జిల్లాలో ప్రజలు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రవి పఠాన్‌ శెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఎస్పీ కేవీ మురళీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలలు, స్వయం సహాయక బృందాలకు, పారిశ్రామికవాడల డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు ప్రధానంగా రహదారి భద్రతపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. అవసరమైన చోట స్పీడ్‌ బ్రేకర్లు, సిగల్‌ లైట్లు, హెచ్చరికల బోర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆర్‌ అండ్‌ బి, ట్రాన్స్పోర్ట్‌, పోలీస్‌, నేషనల్‌ హైవే శాఖలు సంయుక్తంగా ఎక్కువగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో తగు జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్‌ జిల్లా ఆసుపత్రిలో 24 గంటలు ఎముకల వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీ విజయభాస్కర్‌, డిఆర్‌ఓ వెంకటరమణ, జిల్లా రవాణా శాఖ అధికారి ఎం వీర్రాజు, ఆర్‌ అండ్‌ బి ఈ ఈ రమేష్‌, ఎన్టీఆర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రావణ్‌ కుమార్‌, డిఆర్డిఏ పిడి లక్ష్మీపతి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్‌, రవాణా పోలీస్‌ శాఖ అధికారులు పాల్గొన్నారు.