Sep 23,2023 21:51

విద్యుత్తు మీటర్‌ను తనిఖీ చేస్తున్న పృధ్విరాజ్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లాలో గృహ విద్యుత్‌ మీటర్లను ఎపిఇపిడిసిఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డెరెక్టర్‌ ఐ.పృద్వితేజ్‌ శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని డక్కినవీధి, చిన్న వీధి, బొడ్డువారి జంక్షన్‌ తదితర ప్రాంతాల్లో విద్యుత్‌ మీటర్లను తనిఖీ చేశారు. విద్యుత్‌ వినియోగంలేని గృహాలకు మీటర్లు ఉన్నాయా? వీటికి విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారా.. లేదా? అక్రమ విద్యుత్‌ కనెక్షన్లు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. మీటర్ల పని తీరు తో పాటు వాడుతున్న లోడ్‌ తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ ను వినియోగదారులకు అందించడంలో ప్రభుత్వ సహకారంతో ప్రయత్నిస్తున్నా మని. వినియోగదారులు కూడా విద్యుత్‌ బిల్లులు సకాలంలో చెల్లించాలని అన్నారు. వినియోగదారుల సిటిజెన్‌ చార్టర్‌ ను ఖచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతీ వినియోగదారుడూ తన విద్యుత్‌ సర్వీసుకు ఆధార్‌నంబర్‌తో అనుసందానం చేసుకోవాలని, ఇందుకు సంబంధిత సెక్షన్‌ కార్యాల యాన్ని సంప్రదించాలని కోరారు. ఆయన వెంట ఎస్‌ఇ లక్ష్మణరావు, ఇఇ నాగిరెడ్డి కృష్ణమూర్తి, విద్యుత్‌శాఖ సిబ్బంది పాల్గొన్నారు.