
ఎమ్మెల్యే బాబూరావు
ప్రజాశక్తి- నక్కపల్లి:50 పడకల ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో శని వారం సాయంత్రం వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ శ్రావణ్ కుమార్, నక్కపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ ఈశ్వర్ ప్రసాద్ ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నక్కపల్లి 50 పడకల ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అదే విధంగా చూడాలని శ్రావణ్ కుమార్‌కు సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు కొరత లేకుండా చూడాలన్నారు. ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు వైద్యశాఖ ఉన్నతాధికారులకు నివేదిక పంపించాలని సూచించారు. నివేదిక మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు.