Apr 13,2023 21:05

మృతదేహాన్ని బయటకు తీస్తున్న పోలీసులు

ట్రాక్టర్‌ను ఢకొీన్న కారు



ప్రజాశక్తి - పాణ్యం

మండలంలోని 40వ నెంబర్‌ జాతీయ రహదారిపై ఎస్‌ఆర్‌బిసి ప్రధాన కాలువ వంతెన వద్ద కారు ట్రాక్టర్‌ను ఢకొీని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. వివరాల మేరకు.. గురువారం తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్‌ నుండి తిరుపతి వెళుతున్న కారు ముందుగా వెళ్తున్న ట్రాక్టర్‌ను అతివేగంతో ఢకొీంది. దీంతో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఎడమవైపున కారు యజమాని బాలరాజు (36) అక్కడికక్కడే మృతి చెందాడు. వేగం దాటికి ట్రాక్టర్‌ ట్రాలీ తిరిగి పడి కారు డివైడర్‌పైకి చేరింది. కారు డ్రైవరు నిజాంపురం వినీత్‌ను, కారులో ఉన్న సుద్ధ గొని ప్రేమ్‌, గొల్లపల్లి అభిలాష్‌, ట్రాక్టర్‌ డ్రైవర్‌ మధులను చికిత్స నిమిత్తం శాంతిరాం వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసు కున్న ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి హైవే పెట్రోలింగ్‌ వాహనము హెడ్‌ కానిస్టేబుల్‌, నేషనల్‌ హైవే టోల్గేట్‌ సిబ్బంది, సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. కారులో నలుగురు మిత్రులు సంగారెడ్డి హైదరాబాదుకు చెందినవారుగా గుర్తించారు. క్రిష్ణగిరి మండలం, గ్రామం నుండి మహానంది మండలం సీతారామ పురంలో వరిగడ్డి కోసం వెళ్తున్న ట్రాక్టర్‌ను కారు బలంగా ఢకొీన్న ది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.