మృతి చెందిన నారాయణరావు
ప్రజాశక్తి - సీతంపేట : కొత్తూరు నుండి కలప లోడుతో రాజాం వెళ్తున్న ట్రాక్టర్‌పై ఉన్న వంజరాపు నారాయణరావు (65) సీతంపేట సమీపాన జారిపడి మృతి చెందారు. వివరాలకు వెళ్తే విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలం మునకాలవలసకు చెందిన నారాయణరావు శనివారం రాత్రి కొత్తూరు నుంచి రాజాం వెళ్తున్న కలపలోడుతో వచ్చాడు. ప్రమాదశాత్తు జారిపడంతో అక్కడ దగ్గరలో మృతి చెందాడు . మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సీతంపేట ఎస్సై ఎ.నీలకంఠరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










