ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందిన సంటనా స్థలం
ప్రజాశక్తి - లింగసముద్రం :ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగపడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని మాలకొండరాయునిపాలెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలల్లో వెళ్లితే తిమ్మారెడ్డిపాలెం గ్రామానికి చెందిన కసిరెడ్డి శ్యామ్ మాల కొండరాయునిపాలెం గ్రామానికి చెందిన పొలంలో సేద్యం చేసిన అనంతరం తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో అదుపు తప్పి ట్రాక్టర్ ముక్తేశ్వరం చెరువులో బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడిక్కడే చనిపోయారు.శ్యామ్ మృత్తి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీగా విలపిస్తున్నారు.తిమ్మారెడ్డిపాలెం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.










