
సమావేశంలో మాట్లాడుతున్న పిఒ కల్పనాకుమారి
సీతంపేట : ఓటర్ల జాబితాలో ఉన్న తప్పిదాలను త్వరితగతిన సరిదిద్దాలని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. గురువారం సీతంపేట, భామిని మండలాల సూపర్ వైజర్లు, బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పిఒ మాట్లాడుతూ ఓటరు జాబితాలోని ఓట్లను తొలగించేటప్పుడు ఎన్నికల నియామావళికి అనుగుణంగా తొలగించాలని సూచించారు. కొత్తగా ఓటు నమోదుకు అర్హత ఉన్నవారిని చేర్పించాలని అన్నారు. చనిపోయిన వారి ఓట్లను మరణ ధ్రువీకరణ పత్రం ద్వారా నిర్దారించుకొని తొలగించాలన్నారు. సరిగ్గా కనబడని, తప్పుగా ముద్రించబడిన ఫొటోలను మార్చాలని అన్నారు. సూపర్‌వైజర్లు, బిఎల్‌ఒలు బాధ్యతగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో సీతంపేట, భామిని తహశీల్దార్లు నరసింహమూర్తి, అప్పారావు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.