Sep 01,2023 20:59

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

 రాయచోటి : రాజకీయ పార్టీల సహకారంతో జిల్లాలో స్వచ్ఛమైన ఓటరు జాబితా రూపకల్పనకు కషి చేస్తున్నామని కలెక్టర్‌ గిరీష తెలిపారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లాలో ఓటర్ల జాబితాపై , ఇంటింటి పరిశీలన అంశంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఓటరు జాబితా ఇంటింటి పరిశీలన దాదాపు పూర్తి అయిందన్నారు. సదరు పరిశీలన సమాచారాన్ని ఎప్పటికప్పుడూ రాజకీయ పార్టీలకు అందజేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 31 నాటికి జిల్లాలో 13,56,348 మంది ఓటర్లు ఉండగా ఇందులో 13,56,102 మందిని ఇంటింటికి వెళ్లి భౌతికంగా పరిశీలిం చారన్నారు. బిఎల్‌ఒల యాప్‌లో 13,44,489 మంది నమోదయ్యారని చెప్పారు. బిఎల్‌ఒ యాప్‌, భౌతిక పరిశీలనకు మధ్య ఉన్న తేడా ఓటర్లను గుర్తిం చడంలో రాజకీయ పార్టీలు కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు. ఇంటింటి పరిశీలనకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న అన్ని ఓట్లను పరిశీలి స్తున్నామని ఆ ఇంటిలో ఓటరు జాబితాలో పేరు ఉంటుంది కానీ భౌతికంగా మనిషి అక్కడ ఉండరు అలాంటి వాటికి సంబంధించి విచారణ చేసి ఫారం 8లో వివరాలు పొందుతున్నట్లు పేర్కొన్నారు. మతి చెందిన ఓటర్లు, మార్పులు, తొలగింపులకు సంబంధించి రాజకీయ పార్టీలన్నీ ఇచ్చిన జాబితాలను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరుగుతోందన్నారు. గతంలో వారు ఇచ్చిన జాబితా సమాచారం మేరకు పరిశీలన జరిపిన నివేదికను సెప్టెంబర్‌ 10న అందజేస్తామని చెప్పారు. ఇటీవల రాజకీయ పార్టీకి ఇచ్చిన నూతన జాబితాలకు సంబంధించి పరిశీలన చేయాల్సి ఉందని ఇందుకు కొంత సమయం పడు తుందని పేర్కొన్నారు. మార్పు అయిన ఓట్లకు సంబంధించి ఫారం-8 తప్పని సరిగా పొందాలని విఆర్వోలకు కలెక్టర్‌ సూచించారు. నూతన ఓటర్లుగా నమోదు కొరకు ఫారం6 లో దాదాపు 15 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని వాట న్నిటిని పూర్తిగా పరిశీలిస్తామని చెప్పారు. ఆయా నియోజకవర్గాలలో రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశం మినిట్స్‌ను ఎలక్షన్‌ కమిషన్‌ సూచించిన నిర్దేశిత ఫార్మేట్‌ లోనే సమర్పించాలని ఈఆర్వోలు, ఏఈఆర్వోలను ఆదేశించారు. ఏరోజుకు ఆరోజు అన్ని ఫారాలను తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఇంకా ఏమైనా సూచనలు సలహాలు ఉంటే ఇవ్వాలని రాజకీయ పార్టీలను కలెక్టర్‌ కోరారు. ఇంటింటి వెరిఫికేషన్‌ లో అందరూ భాగస్వామ్యం అయినప్పుడే మనం తప్పులు లేకుండా ఎన్నికల ఓటర్ల జాబితాను తయారు చేయగలమని రాజకీయ పార్టీ ప్రతినిధులకు సూచించారు. ఇంటింటి పరిశీలనలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తమ దష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు అందించిన సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని తప్పులు లేని ఓటరు జాబితా రూపకల్పనకు కషి చేస్తామని కలెక్టర్‌ పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, రాయచోటి, రాజంపేట ఆర్‌డిఒలు రంగస్వామి, రామకష్ణారెడ్డి, ఆయా నియోజకవర్గాల ఈఆర్వోలు, తహశీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.