Aug 21,2023 21:28

సీతానగరం : సమావేశంలో మాట్లాడుతున్న వ్యవసాయాధికారి అవినాష్‌

ప్రజాశక్తి - పాచిపెంట : గ్రామ వ్యవసాయ సహాయకులంతా పంట కోత ప్రయోగాలను ఎలాంటి తప్పుల్లేకుండా చాలా కచ్చితంగా నిర్వహించాలని సాలూరు సహాయ వ్యవసాయ సంచాలకులు మధుసూదన్‌ రావు అన్నారు. పంట కోత ప్రయోగాలపై మండలంలోని కొటికపెంట ఆర్‌బికెలో విఎఎలకు నిర్వహించిన మండల స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పంటల బీమా పంట కోత ప్రయోగాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడుతుందన్నారు. కాబట్టి ఎలాంటి అవకతవకలు లేకుండా పక్కా ప్రణాళికతో పంట కొత్త ప్రయోగాలు నిర్వహించాలని ఏమైనా సమస్యలుంటే అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ వారిని సంప్రదించాలని కోరారు. కార్యక్రమ శిక్షకులుగా విచ్చేసిన ఎఎస్‌ఒ ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ రెండు రోజులు ముందుగానే పంటల భీమా కంపెనీ ప్రతినిధులకు తెలియజేయాలని, ఫారం-1 ముందుగానే పంపించాలని, పంట కోత ప్రయోగాల సూపర్వైజర్లకు జిల్లా యాజమాన్యానికి తెలియజేయాలని ఎలాంటి అవకతవకలు లేకుండా పంట కొత్త ప్రయోగాలు నిర్వహణ చేపట్టాలని అన్నారు. జాతీయ ఆదాయం లెక్కలకు పంటల భీమా పరిహారానికి పంట నష్టపరిహారాల పరిహారానికి అన్నింటికీ ఈ పంట గుంత ప్రయోగాలు ఉపయోగ పడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎఒ కె.తిరుపతిరావు, విఎఎలు పాల్గొన్నారు.
సీతానగరం : మండలంలోని పెదభోగిలి రైతు భరోసా కేంద్రంలో సీతానగరం మండలం గ్రామ వ్యవసాయ, ఉద్యానవన సహాయకులకు పంట కోత ప్రయోగాలపై డివైఎస్‌ఒ, ఎఎస్‌ఒ సతీష్‌ శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ అనేది ఈ పంటకోత ప్రయోగాలు ఆధారంగానే ఇవ్వటం జరుగుతుందని, ఐదేళ్లు ముందున్న నార్మల్‌వైల్డ్‌ ప్రాతిపదికన పంట దిగుబడి నష్టాన్ని అంచనా వేస్తారని, జిల్లాలో అధికంగా పండిస్తున్న పంటను బట్టి పంటకోత ప్రయోగాలు ఏ పంటకు చేయాలని నిర్ణయించబడతాయని తెలిపారు. అలాగే జిల్లాలో ఒక గ్రామం యూనిట్‌గా వరికి బీమా అమలు చేస్తున్నామని, ప్రతి 100 హెక్టార్లను ఒక యూనిట్‌గా తీసుకొని పంట కోత ప్రయోగాలు నిర్వహిస్తున్నామన్నారు. వరి, గోగునార, చెరకులో 5×5 మీటర్లు, కందిలో 10×10 మీటర్ల ప్లాట్‌లో పంటకోత ప్రయోగం నిర్వహించాలని, సర్వే నెంబర్‌, సబ్‌ డివిజన్‌ ద్వారా నైరుతి మూల దిశగా, వ్యతిరేక సవ్య దిశలో ప్లాట్‌ ఐడెంటిఫికేషన్‌ చేయాలన్నారు. పంట కోత ప్రయోగాలకు నిర్దేశించిన యాప్‌లో ర్యాండమ్‌గా ఎంపికచేసిన రైతుల వివరాలను నమోదు చేయాలన్నారు. పంట రకాన్ని పంటకోత కోసే సమయాన్ని జాగ్రత్తగా వేయాలని తెలిపారు. అలాగే ఖరీఫ్‌-2023, ఇ-పంట నమోదు జియో కో ఆర్డినేట్లతో చేస్తున్నామని, రైతులంతా గ్రామ వ్యవసాయ సహాయకులు దగ్గర తాము వేసిన పంటకు గాను పంట నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి తెలియచేశారు. కార్యక్రమంలో ఎఒ అవినాష్‌, డివైఎస్‌ఒ, ఎడిఎ వెంకటేష్‌, విఎఎలు,ఉద్యానవన సహాయకులు పాల్గొన్నారు.