Oct 25,2023 20:40

గౌస్‌నగర్‌లో ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు

కడప అర్బన్‌ : టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుని తప్పుడు కేసులో ప్రభుత్వం జైల్లో పెట్టించిందని టిడిపి సీనియర్‌ నాయకులు లక్ష్మీరెడ్డి, కడప నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి అమీర్‌ బాబు, నాయకులు మన్మోహన్‌రెడ్డి విమర్శించారు. బుధవారం గౌస్‌నగర్‌లో భవిష్యత్తు గ్యారెంటీ, బాబుతో నేను, శ్రీశక్తి కార్యక్రమం ప్రజల వద్దకు తీసుకు వెళ్లారు. కరపత్రాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భువనేశ్వరుని రోడ్డుపైకి తీసుకొని వచ్చి వైసిపి నాయకులు వైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. లోకేష్‌ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముందుకు వెళుతున్నారని చెప్పారు. జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. న్యాయం జలవాలి అనే కార్యక్రమాన్ని ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు నారా భువనేశ్వరి బస్సు యాత్ర చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆమూరి బాలరాజు, తెలుగు యువత నగర అధ్యక్షులు మేకల వెంకటేష్‌ యాదవ్‌, నగర ఉపాధ్యక్షులు కొండా సుబ్బయ్య, న్యాయవాది లింగాల శివశంకర్‌ రెడ్డి, మాజీ వార్డ్‌ మెంబర్‌ జయరామిరెడ్డి, పాలకొండ స్వామి ఆలయ మాజీ చైర్మన్‌ ఓబుల్‌ రెడ్డి, మాజీ ఎంపిటిసి పిచ్చయ్య, బాబా ఫక్రుద్దీన్‌, కొండాయపల్లి నాగేంద్ర నాయుడు, ఆరవ డివిజన్‌ సీనియర్‌ నాయకులు మామిళ్ళ శివ, పుట్లంపల్లి మురళీమోహన్‌, నవీబీ కోట శ్రీనివాసులు, మైనార్టీ నాయకులు ఇమ్రాన్‌, నాసర్‌ అలీ, బుల్లెట్‌ నూర్‌, అమానుల్లా, వల్లి, సయ్యద్‌ నూర్‌, ఏలియా బాబు, మహిళా నాయకురాలు చిప్పగిరి మీనాక్షి, స్వర్ణలత, నిర్మల, అరుణ పాల్గొన్నారు.