Sep 11,2023 23:59

ప్రజాశక్తి - చీరాల
చట్టం ముందు అందరు సమానులేనని, తప్పు చేసిన వాళ్లెంతటి వారైనా శిక్ష తప్పదని ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. స్థానిక ఆర్అండ్‌బి అతిధి గృహంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సూత్రదారైన చంద్రబాబు అరెస్టును ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టిడిపి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రకటించినప్పటికీ ప్రజలు ఎవరు సహకరించలేదని స్పష్టం చేశారు. చీరాల ప్రాంతంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందు జరగలేదని అన్నారు. ప్రజలందరూ స్వేచ్చగా వ్యాపారాలు చేసుకుంటూ ప్రశాంత వాతావరణంలో ఉన్నారని అన్నారు. టిడిపి నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఎవరు పట్టించుకోరని అన్నారు. రాబోయే ఎన్నికలలో వైసిపి జెండా ఎగరేస్తుందని అన్నారు. పేద ప్రజల పక్షాన అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్ బాబు, పట్టణ అధ్యక్షులు కోండ్రు బాబ్జి, గుంటూరు మాధవరావు, కౌన్సిలర్ మించాల సాంబశివరావు పాల్గొన్నారు.