Jul 16,2023 23:30

గర్భిణీని డోలీలో ఆసుపత్రికి తరలిస్తున్న బంధువులు

ప్రజాశక్తి -కోటవురట్ల:మండలంలో గొట్టువాడ శివారు గిరిజన గ్రామమైన అణుకు ప్రాంతానికి చెందిన తంగేళ్ల రమ్య ఆదివారం రాత్రి ప్రసవ వేదనతో అవస్థలు పడింది. దీంతో, గిరిజనులు అణుకు నుండి ఐదు కిలోమీటర్ల మేర గ్రామస్తులు డోలి మోతతో గొట్టువాడ ప్రధాన రహదారి వద్దకు తీసుకువచ్చారు, అక్కడి నుంచి 108 సహాయంతో స్థానిక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్కు గర్భిణీని తీసుకొచ్చి హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. రహదారి సక్రమంగా లేక పోవడంతో అత్యవసరం పరిస్థితిలో డోలీ మోతతో ఆసుపత్రికి రావాల్సి వస్తుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు.