Aug 21,2023 21:36

తుప్పల్లోకి దూసుకుపోయి బోల్తాపడ్డ వ్యాను

ప్రజాశక్తి - వీరఘట్టం : మండల కేంద్రానికి సమీపాన గల చిదిమి గ్రామ జంక్షన్‌ వద్ద సోమవారం వాహనం బోల్తా పడి తుప్పల్లోకి దూసుకుపోయింది. ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవ డంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మండలంలోని యు.వెంకం పేటకు చెందిన ముగ్గురు వ్యక్తులు కార్లో వస్తుండగా చిదిమి జంక్షన్‌ వద్దకు వచ్చేసరికి ఈ ఘటన జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలించగా ఎటువంటి ప్రమాదం సంభవించలేదు. ముగ్గురు వ్యక్తులు క్షేమంగా ఉన్నట్లు ఎస్సై ఎం వెంకటరమణ తెలిపారు. మలుపు వద్ద పిచ్చి మొక్కులు తొలగించక పోవడంతో ఎప్పటికప్పుడే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మొక్కల వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించడం లేదు. వీటిని తొలగించడంలో ఆర్‌అండ్‌బి అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మలుపు వద్ద పిచ్చి మొక్కులు తొలగించాలని స్థానికులు కోరుకున్నారు.