
మాట్లాడుతన్న నాయకులు
ప్రజాశక్తి -పొదలకూరు :పొదలకూరు పట్టణంలోని తపాలా కార్యాలయ ప్రాంగణంలో ఆదివారం అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం ప్రాంతీయ సమావేశం జరిగింది. యూనియన్ నాయకులు ఆర్. గోవింద నాయక్ ,సి సుధాకర్ రాజు, శ్రావణ్ కుమార్, రమణయ్య ,పెంచలయ్య ,ఎస్ డి ఫైరోస్ ప్రాంతీయ సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ పై సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ఇటీవల ప్రమోషన్ పొందిన పోస్ట్మాన్ సదాశివయ్య ను ఘనంగా సన్మానించారు. రాపూరు, గుండవోలు, కలిచేడు, విలువూరు ,చేజర్ల, సైదాపురం, గూడూరు తదితర ప్రాంతాల జిడిఎస్ ఉద్యోగులు హాజరయ్యారు.