Nov 09,2023 21:48

మాట్లాడుతున్న సిఐ


మాట్లాడుతున్న సిఐ

టపాకాయల విక్రయాలకు అనుమతి తప్పనిసరి
ప్రజాశక్తి-సంగం:స్థానిక సర్కిల్‌ కార్యాలయం లో సిఐ రవి నాయక్‌ మీడియా సమావేశం నిర్వహించారు. సర్కిల్‌ పరిధిలో టపాకాయల దుకాణాలు ఏర్పాటు చేసుకునేవారు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. అనుమతులు లేకుండా టపాకాయలు విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.టపాకాయల దుకాణాలలో నిర్వాహకులు ఫైర్‌ నియమ నిబంధనలు పాటించాలన్నారు. ప్రజలు టపాకాయల కాల్చే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు ముందస్తుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.