Aug 16,2023 19:43

ట్రై సైకిల్‌ అందిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు : ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో బాధపడే పేదలకు కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు నిరంతరం చేయూతనందిస్తూ అండగా నిలుస్తున్నారు. కందుకూరు మండలం, దొండపాడుకు చెందిన విభిన్న ప్రతిభావంతురాలు పాలవల్లి శేషమ్మకు బుధవారం ట్రైసైకిల్‌ అందించి నాగేశ్వరరావు మానవత్వం చాటుకున్నారు. ఓగూరు గ్రామానికి చెందిన అరివేణి సాంబయ్య అనే పేద కుటుంబానికి ఆసరాగా నిలిచేందుకు నాగేశ్వరరావు తోపుడుబండి అందజేశారు. వారిద్దరూ నాగేశ్వరరావుకు కతజ్ఞతలు తెలిపారు. కందుకూరులోని టిడిపి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు బి కష్ణారెడ్డి, పచ్చవ తిరుపతిస్వామి, మండల తెలుగు యువత అధ్యక్షుడు రావుల రవి, ఎ వెంకటేశ్వర్లు, చక్రవర్తుల విజయకుమార్‌ పాల్గొన్నారు.