అమరావతి: అమరావతి గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమరావతి - బెల్లంకొండ రోడ్డు నిర్మాణ పనులను గురు వారం ప్రారంభించామని పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు.శంకరరావు అన్నారు. అమరావతి మండలం ధరణకోట వద్ద అమరావతి - బెల్లంకొండ డబుల్ లైన్ రోడ్డు పనుల ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకరరావు మాట్లా డుతూ ఎన్నో సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురుచూసిన క్షణం వచ్చే సిందన్నారు. అమ రావతి - బెల్లంకొండ రోడ్డు పెదకూరపాడు నియోజకవర్గా నికి మణిహారంలా మారుతుందన్నారు. అమరావతి నుంచి బెల్లంకొండ వరకు సుమారు 47 కిలోమీటర్ల మేర 10 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తున్నామన్నారు. దీన్ని 9 నెలల్లో పూర్తి చేసి తీరతామన్నారు. నియోజకవర్గంలో మాదిపాడు వద్ద కృష్ణానదిపై బ్రిడ్జి కూడా త్వరలోనే పూర్తి చేస్తా మన్నారు.










