Sep 02,2023 20:31

కుమార్తె వద్ద విధుల్లో చేరుతున్న తండ్రి

ప్రజాశక్తి-గుడ్లూరు :గుడ్లూరు మండలం, చేవూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్య అధికారిగా పనిచేస్తున్న ఎస్‌.కె సబిహా దగ్గర ఆమె తండ్రి ఎస్‌కె ఆరిఫ్‌ సిహెచ్‌గా శుక్రవారం విధుల్లో చేరారు వైద్య విద్య పూర్తి చేసిన ఎస్‌.కె సబిహా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం పథకం లో భాగంగా గుడ్లూరు మండలం చేవూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారిగా ఎస్‌కె సబిహ విధుల్లో చేరి వైద్య సేవలు అందిస్తున్నారు. ఉలవపాడు మండలం చాకిచెర్ల ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో సూపర్‌వైజర్‌గా చేస్తున్న ఎస్‌ కె ఆరిఫ్‌ పదోన్నతపై చేవూరు ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలో సి హెచ్‌ఒగా ఆయన కుమార్తె ఎస్కే సబిహ దగ్గర వీధుల్లో చేరడం పలువురిని ఆశ్చరపరిచింది.