Oct 12,2023 22:21

ప్రజాశక్తి - తణుకు
            స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో త్రో బాల్‌ పోటీలను పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, కలెక్టర్‌ పి.ప్రశాంతి, జెసి ఎస్‌.రామసుందర్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలకు చెందిన అండర్‌-17 త్రో బాల్‌ సెలక్షన్స్‌ ఆటల పోటీలు ఇక్కడ జరుగుతాయని తెలిపారు. ఈ పోటీలను క్రీడాకారులు వినియోగించుకుని రాణించాలన్నారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ క్రీడల్లో రాణించిన విద్యార్థులకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి వంక రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.