Dec 15,2022 23:34

నూతన భవనాలు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రమణమూర్తిరాజు

ప్రజాశక్తి-అచ్యుతాపురం
మండలంలోని తంతడి గ్రామంలో ప్రభుత్వం నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్‌ సెంటర్‌ (హాస్పటల్‌) భవనాలను గురువారం ఎలమంచిలి ఎమ్మెల్యే యువి రమణమూర్తి రాజు, డిసిసిబి మాజీ చైర్మన్‌ యు.సుకుమార్‌ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలోనే ప్రభుత్వ వ్యవస్థ ద్వారా సుపరిపాలన అందించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇక్కడ పనిచేసే సిబ్బంది ప్రజలకు మేలైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా రమణమూర్తిరాజును, సుకుమార్‌ వర్మను గ్రామస్తులు జ్ఞాపిక అందజేసి పూలమాలవేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్‌ నాయకులు కోన బుజ్జి, ఎంపీటీసీ సభ్యురాలు రాజాన పద్మావతి అప్పారావు, గ్రామ సర్పంచ్‌ చౌడిపల్లి మురళి, మోటూరు సంజీవి, ఎస్‌ జువాల నాయుడు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.