Aug 01,2021 16:35

చెన్నై : కరోనా మహమ్మారి పేద, ధనిక అంటూ తేడా లేకుండా అందరి జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఈ మహమ్మారి సృష్టించిన అలజడికి ఎంతో మంది ఉపాధి కోల్పోయి రోడ్డుపాలయ్యారు. అయితే, ఇదే సమయంలో చాలా మంది తమ మానవత్వాన్ని చాటుకున్నారు. వారికి తోచినంత సాయాన్ని సిఎం సహాయ నిధికి లేదా ఫౌండేషన్లకు అందజేశారు. మరికొంత మంది ఆకలితో అలమటించే వారిని స్వతహాగా సహాయం చేసి అదుకున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా తమిళనాడులో ఓ యాచకుడు చేసిన సహాయం తెలిసిన వారంతా ఆయనను మెచ్చుకోక మానట్లేదు. భిక్షాటన చేస్తూ సంపాదించిన రూ.4.5 లక్షలను తమిళనాడు సిఎం సహాయ నిధికి అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు. పూలపాండ్యన్‌ (80) అనే వృద్ధుడు కరోనా బాధితుల కోసం ఈ మొత్తాన్ని అందజేశారు. తూత్తుకుడి జిల్లా సాత్తాన్‌కుళం సమీపంలోని నాదన్‌కినరు గ్రామానికి చెందిన పూలపాండ్యన్‌ మదురైలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు.