
ప్రజాశక్తి-హిందూపురం |: తండ్రి అవినీతిలో ఆయన తనయుడు లోకేష్ హస్తం ఉందని వైసిపి ఇన్‌ఛార్జి దీపిక ఆరోపించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గోదావరి పుష్కరాలలో చంద్రబాబు నాయుడు తన పబ్లిసిటీ కోసం రాజమండ్రిలో 29 మందిని పొట్టన పెట్టుకున్నారన్నారు, కందుకూరులో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలో 8 మంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారన్నారు. ఏ రోజైనా వారి ఆత్మలకు శాంతి కలగాలని ఇలా కొవ్వొత్తుల ర్యాలీలు చేశారా అని ప్రశ్నించారు. అవినీతి కేసలో అరెస్టు అయిన బాబు కోసం కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శన చేయడం విడ్డురంగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల సొమ్ము దొచేసి, ఆధారాలతో సహా అడ్డంగా దొరికి న్యాయస్థానం ముందు దోషిగా నిలబెడితే న్యాయస్థానం రిమాండ్ విధించిందన్నారు. తన రాజకీయ స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. టిడిపి నాయకులు రిలే నిరాహార దీక్షలు చేయడాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడుగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ సొంత కొడుకు కన్నా ఎక్కువగా స్పందిస్తున్నారని విమర్శించారు. లోకేష్ కూడా కచ్చితంగా అవినీతి కేసుల్లో అరెస్టు అవుతారని జోస్యం చెప్పారు.