Nov 08,2023 19:45

వైసిపి నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ద్వారకనాథ్‌రెడ్డి

ములకలచెరువు : తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరిగిన అభివద్ధి జిల్లాకే ఆదర్శం అని ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలలో అభివద్ధిలో పూర్తిగా వెనుకబడిన తంబళ్లపల్లె నియోజ కవర్గం అభివద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందన్నారు. బుధవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండలంలోని వైసిపి నాయకులు, ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనలో అణగారిన వర్గాలతో పాటు బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి మంత్రివర్గంలో స్థానం కల్పించి వారి అభివద్ధికి అహర్నిశలు కషి చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా మహిళలకు ఆర్థికంగా సామాజికంగా వారి అభివద్ధి కోసం రాయితీలు కల్పించి మహిళా పక్షపాతిగా మారినట్లు చెప్పారు. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చేసిన అభివద్ధి, సంక్షేమ పథకాలు అణగారిన వర్గాల కోసం చేసిన అభివద్ధి అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి చేసిన అభివద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని సూచించారు. ములకలచెరువులో 10న జరిగే బస్సుయాత్ర విజయవంతం చేయడానికి మండలంలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సమిష్టి కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షులు మాధవ రెడ్డి, జడ్‌పిటిసి మోహన్‌రెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌ అధ్యక్షుడు గౌరీ శంకర్‌ రెడ్డి, మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, సర్పంచులు రాంబాబు, జయచంద్రకుమార్‌, రామనాథ్‌, రవి శేఖర్‌రెడ్డి, రెడ్డప్ప పాల్గొన్నారు.