Jul 17,2023 18:39

టమోటాల కోసం బారులు తీరిన ప్రజలు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు రైతు బజార్లో సబ్సిడీ టమోటాల కోసం ప్రజలు సోమవారం బారుóలు తీరారు. టమోటా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలకు కొనడం కష్టతరంగా మారింది. కందుకూరు రైతు బజార్లో టమోటాల ధర కిలో రూ. 125 అమ్ముతున్నారు. దీంతో టమేటా కాయలు కొనడం కష్టంగా మారడంతో ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి సూచన మేరకు రైతు బజారులో కిలో రూ. 50 వంతుల టమోటాలు విక్రయించడానికి శ్రీకారం చుట్టారు. సబ్సిడీ టమాటాలు అమ్మే రోజు ప్రజలు బాలు తీరి వాటికోసం పడిగాపులకయడం కనిపించింది. సబ్సిడీ టమాటాలు ప్రతిరోజు అందుబాటులో ఉండటం లేదు.