Jul 19,2023 18:05

ప్రజాశక్తి - ఏలూరు అర్బన్‌
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న రెడ్‌క్రాస్‌ తల సేమియా భవనంలో బుధవారం 11 మంది తలసేమియా చిన్నారులకు రక్త మార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ బివి కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా లయన్స్‌క్లబ్‌ గవర్నర్‌ గట్టు మాణిక్యాలరావు, లయన్స్‌క్లబ్‌ సభ్యులు పద్మజ, డిసిఎస్‌ మల్లేశ్వరరావు, సిహెచ్‌ అవినాష్‌లు తలసేమియా చిన్నారులను పరామర్శించి వారికి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం తలసేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు 30 మందికి మధ్యాహ్నం ఉచిత భోజనం ఏర్పాటు చేసిన మానవత విద్యానిధి, కేంద్ర నియంత్రణ కమిటీ ఛైర్మన్‌ ఆలపాటి నాగేశ్వరరావుకు కృష్ణారెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్‌ కార్యదర్శి బి.బెన్నీ, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ కె.వరప్రసాదరావు, మానవత సభ్యులు కడియాల కృష్ణారావు, రత్నకరరావు పాల్గొన్నారు.