Aug 05,2023 22:36

కొత్తూరు : పౌష్టిహార స్టాళ్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి

ప్రజాశక్తి- కొత్తూరు: తల్లిపాలతోనే బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. స్థానిక బోర సూర్యనారాయణ కళ్యాణ మండపంలో ఐసిడిఎస్‌ ప్రాజెక్టు అధికారి ఉప్పడా విమలకుమారి అధ్యక్షతన నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లీబిడ్డలు ఆరోగ్యమే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సొంత బిడ్డలు వేలే సూచుకొని పౌష్టికాహారం అందించే బాధ్యత తీసుకోవాలన్నారు. అంతకుముందు అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన పౌష్టిహారం స్టాళ్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు కిట్లను అందజేశారు. కార్యక్రమంలో పీడీ జయదేవి, తహశీల్దార్‌ ఎం.చక్రవర్తి, సూపర్‌వైజర్‌ సుధారాణి, ఎపిఎం త్రినాథమ్మ, జెడ్‌పిటిసి భాగ్యలక్ష్మి వైసిపి మండల కన్వీనర్‌ సారిపల్లి ప్రసాదరావు, పిఎసిఎస్‌ అధ్యక్షులు చింతాడ సూర్యనారాయణ, సర్పంచ్‌లు కృష్ణవేణి, రత్నాలు, పేదకోట సాధుబాబు పాల్గొన్నారు.
మెళియాపుట్టి : స్థానిక కమల కళ్యాణ మండపంలో గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లను ఎమ్మెల్యే రెడ్డి శాంతి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఎండయ్య, తహశీల్దార్‌ పి.సరోజని, ఎంపిడిఒ పి.చంద్రకుమారి, మండల ఎఒ దానకర్ణుడు, పీడీ విజయభారతి, పాతపట్నం పిఒ విమలారాణి, స్థానిక సూపర్‌వైజర్‌ అమరావతి, బాలరాజు, ఉదరు, యోగి పాల్గొన్నారు.
బూర్జ : మండలంలోని అక్కుపురం అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణులకు, బాలింతలకు ఎంపిపి కర్నేన దీప సంపూర్ణ పౌషణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వియ్యపు విజయలక్ష్మి, పాలవలస, పనుకుపర్త రామన్నపేట, మర్రిపాడు, కొత్తవలస అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.
కవిటి: మండలంలోని దూగానపుట్టుగలో గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లను సర్పంచ్‌ డి.భద్రాచలం అందజేశారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు బి.ఢిల్లీరావు, డి.హేమారావు, బి.రాజారావు, డి.తులసీదాసు పాల్గొన్నారు.
పొందూరు: పొందూరు సెక్టార్‌ పరిధిలోని స్థానిక గాంధీనగర్‌ అంగన్వాడీ కేంద్రం-2లో గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లను సర్పంచ్‌ రేగడి లక్ష్మి అందజేశారు.ఎంపిటిసిలు వి.పద్మావతి, ఎ.వాణి, కె.చల్లమాంబ, బి.హారిక, సూపర్‌వైజర్‌ రమాదేవి, ఎఎన్‌ఎంలు, సచివాలయ మహిళా పాల్గొన్నారు.
జలుమూరు: చల్లవానిపేట ఒకటి సెక్టార్‌ సూపర్‌వైజర్‌ సీతారత్నం ఆధ్వర్యాన వైస్‌ ఎంపిపి డోల నాగరత్నం సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేశారు. ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం, మహిళా పోలీస్‌ కళ్యాణి, ఎఎన్‌ఎం స్వప్న, ఆశా కార్యకర్త మీనా, కార్యకర్తలు జయలక్ష్మి, మాలతి, కె.ఈశ్వరమ్మ, డి.దమ యంతి, ఎస్‌.విమల, కె.కాంతమ్మ పాల్గొన్నారు.
కోటబొమ్మాళి: చిన్నసాన అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులకు, బాలింతలకు సంపూర్ణ పోషణ కిట్లను సర్పంచ్‌ బోనేల పావని అందజేశారు. కార్యక్రమంలో ఎల్లయ్య, నారాయణరావు, సచివాలయ కానిస్టేబుల్‌, అంగన్వాడీ కార్యకర్త పాల్గొన్నారు.
పలాస : మందలంలోని మోదుగులపుట్టి అంగన్వాడీ కేంద్రంలో ఎంపిపి ఉంగ ప్రవీణ బాలింతలకు, గర్భిణులకు సంపూర్ణ పోషణ కిట్లను అందజేశారు. టెక్కలిపట్నం సర్పంచ్‌ పతినిధి పాలిన కృష్ణారావు, వార్డు మెంబరు ఎ.పార్వతీశం, అంగన్వాడీ కార్యకర్త పుణ్యవతి, ఆశాకార్యకర్త ఎం.విజయలక్ష్మి పాల్గొన్నారు.