Mar 12,2023 01:31
సమావేశంలో మాట్లాడుతున్న హెచ్‌ఎం సాల్మన్‌ రాజు

ప్రజాశక్తి-చీరాల: విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించడమే కాకుండా వారితో స్నేహపూర్వకంగా ఉంటూ వారి అలవాట్లను ఎప్పటికప్పుడు గమనించాలని, తద్వారా పిల్లలు మంచిమార్గంలో నడుస్తూ చదువులో రాణించగలుగుతారని ప్రధానోపాధ్యాయులు బి సాల్మన్‌రాజు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఆంధ్రరత్న పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యా యులు బి సాల్మన్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకు మొదటి గురువు తల్లి అన్నారు. ఉపాధ్యాయుల పైన ఎంత బాధ్యత ఉందో తల్లిదండ్రులపైన కూడా అంతే బాధ్యత ఉందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పిల్లలను ప్రతిరోజూ బడికి పంపించి పరిశుభ్రమైన వాతావరణంలో వారిని ఉంచినప్పుడే వారికి చదువు పట్ల ఆసక్తి కలుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.