ప్రజాశక్తి - చిప్పగిరి
తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను పంపిణీ చేస్తోందని ఎంపిపి జూటూరు హేమలత మారయ్య, ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ప్రసూన తెలిపారు. శనివారం మండల కార్యాలయంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ ప్రసూన ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ కిట్లను ఎంపిపి జూటూరు హేమలత మారయ్య చేతులమీదుగా అందజేశారు. తల్లిపాల వారోత్సవాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఎంపిపి మాట్లాడారు. బాలింతలు, గర్భిణులు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం ఈ పోషణ కిట్లను పంపిణీ చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ కానుకలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలోనూ బాలింతలు, గర్భిణులు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహార కిట్లను తీసుకోవాలన్నారు. ముఖ్యఅతిథులుగా ఎంపిడిఒ సివి.కొండయ్య, ఎంఇఒ సావిత్రమ్మ హాజరయ్యారు. అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
గర్భిణులకు కిట్లు పంపిణీ చేస్తున్న ఎంపిపి జూటూరు హేమలత మారయ్య










