ప్రజాశక్తి-యర్రావారిపాలెం : తలకోన బోర్డు చైర్మన్ ఉమామహేశ్వర్ రెడ్డి గత కొద్ది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందడం జరిగింది.మండలంలోని ఎల్లమంద గ్రామ పంచాయతీకి చెందిన ఇతను గతంలో పలుమార్లు సర్పంచ్ గా సింగల్ విండో చైర్మన్ గా ప్రస్తుతం తలకోన బోర్డు చైర్మన్గా బాధ్యతలు వ్యవహరిస్తూ ఉన్నారు.ఇతని మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.జిల్లాస్థాయిలో అధికారులు మరియు నాయకులు ఇతని మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.సోమవారం సొంత గ్రామమైన ఎల్లమంద లో దహన సంస్కారాలు చేస్తున్నట్లు బంధువులు తెలిపారు.










