Oct 03,2023 00:07

తలకోన జలపాతంలో పడి యువకుడు మృతి

ప్రజాశక్తి-యర్రావారిపాలెం: ప్రముఖ పర్యాటక కేంద్రమైన తలకోన జలపాతంలో ప్రమాద వశాత్తు యువకుడు కాలు జారి నీటి మడు గులో పడటంతో ఊపి రాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడు కు చెందిన శైలేష్‌ (24) హైదరాబాదులో సాఫ్ట్వేర్‌ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. శైలేష్‌ తన ఆరుగురు స్నేహితులతో కలిసి తిరుమ ల కు వెళ్లి దర్శనం చేసుకుని అనంతరం సోమవారం సరదాగా తలకోనకు విచ్చేశాడు. జలపాతంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మడుగులో పడటంతో ఊపిరి ఆడక మృతి చెందినట్లు అతని స్నేహితులు తెలిపారు. సమాచారం అందు కున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మతుని తల్లి దండ్రులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు.