ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ఏలూరు ప్రభుత్వ బోధనాసుపత్రి ప్రాంగణంలోని రెడ్‌క్రాస్ తల సేమియా భవనంలో 15 మంది తల సేమియా చిన్నారులకు రక్త మార్పిడిని నిర్వహించినట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ బివి.కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తల సేమియా వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ పరీక్షలు డాక్టర్‌ని సంప్రదించి చేయించుకోవాలన్నారు. అనంతరం మధ్యాహ్నం తల సేమియా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులకు 35 మందికి ఉచిత భోజనం ఏర్పాటు చేసిన దాత పాలడుగు వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ కార్యదర్శి బి.బెన్ని, డాక్టర్ జి.చైతన్య కిరణ్, ఎన్.విజయ, డి.శిరీష పాల్గొన్నారు.










