ప్రజాశక్తి-రేపల్లె: పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు స్థానిక రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అతి తక్కువ ఫీజుకు చేరి మీ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రిన్సిపాల్ పి సుధాకరరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మార్చి 2023 ఇంటర్మీడియట్ ఫలితాల్లో మా కళాశాల సాధారణ విద్యార్థి కె అనిల్ అసాధారణ స్థాయిలో 984/1000 మార్కులతో ఎంపిసి గ్రూపులో చరిత్ర సృష్టించారన్నారు. ఈ విద్యార్థికి అంతర్జాతీయ ప్రతిష్ట కలిగిన విఐటి అమరావతిలో ఉచిత ప్రవేశం లభించినట్లు చెప్పారు. ప్రభుత్వ కళాశాలలో చదివిన వారికి మాత్రమే ఇటువంటి సౌకర్యం ఉందన్నారు. తమ కళాశాలలో ఎంపిసి, బైపిసి, సిఇసి, హెచ్‌ఇసి, వృత్తి విద్యా కోర్సుల్లో ఎంఅండ్‌ఎటి, ఇఇటి ఉన్నాయి. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు 16.05.23 నుంచి కోరుతున్నామ న్నారు. అందరు విద్యార్థులకు జగన్న అమ్మఒడి పథకం ద్వారా రూ.15,000 వస్తాయన్నారు. ఉచిత పుస్తకాలు, గ్రామీణ ప్రాంతాల వారికి రైలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి. మైనారిటీ లకు ప్రత్యేక స్కాలర్‌షిప్ ఉంది. చదువులో వెనకబడిన వారికి ప్రత్యేక శిక్షణ. ప్రతిరోజూ సాయం సమయాన 4 నుంచి 5.30 గంటల వరకు స్టడీ అవర్ ఉటుంది. ఉచిత మినరల్ వాటర్ సౌకర్యం కలదు. నిష్ణాతులైన అధ్యాపకు లచే కెరీర్ గైడెన్స్, ప్రముఖ మోటివేటర్స్‌తో శిక్షణ తరగతులు ఉన్నాయి. యూనిట్, క్వార్టర్లీ, అర్ధ సంవత్సర, ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించి ప్రోత్సహక బహుమతులు ఇవ్వబడును. సైన్స్ ఒకేషల్ కోర్సుల్లో పూర్తి సామర్ధ్యం కలిగిన లాబ్స్ కలవు. ఎంపిసి గ్రూప్‌లో 60 శాతం సాధించిన విద్యార్థులందరికీ ప్రముఖ హెచ్‌సిఎల్ కంపెనీలో ఉద్యోగాలు, ఒకేషనల్ కోర్స్‌లు చేసిన వారికి అప్రెంటీస్, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంకితభావం, అనుభవం కలిగి నిష్ణాతులైన అధ్యాపకులచే నాణ్యమైన విద్యబోధన ఉంది. ఈ కళాశాలలో చేరిన వారందరికీ విద్యతో పాటు వినయం, విధేయత, సౌశీల్యత, నైతిక విలువలు, మానవత్వపు విలువలతో కూడిన విద్య నేర్పుతామని ప్రిన్సిపాల్ పి సుధాకరరావు విలేకరులకు వివరించారు.










