Sep 27,2023 21:12

జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి
ప్రజాశక్తి - గణపవరం
రైతులు పొలంబడి కార్యక్రమం ద్వారా అవగాహన పెంచుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు బుధవారం అప్పన్నపేటలో జరిగిన వైఎస్‌ఆర్‌ పొలంబడి కార్యక్రమాల్లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఈ సమావేశానికి గ్రామ సర్పంచి నక్క సూరి బంగారయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా ఆరోగ్యమైన సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అన్నదాతలపై ఉందన్నారు. ఎక్కువ మోతాదులో ఎరువులు వాడితే పంట దిగుబడి తగ్గుతుందన్నారు. సేంద్రియ వ్యవసాయం వలన ఖర్చు తగ్గి ఆరోగ్యమైన పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యంతో పాటు భూమిని కూడా కాపాడుకోవచ్చని చెప్పారు. నేడు ప్రకృతి వ్యవసాయం చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండల ఛైర్మన్‌ కైగాల శ్రీనివాసరావు, జిల్లా వ్వవసాయాధికారి జె.వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ పి.లక్ష్మి, ఎంపిడిఒ జి.జ్యోతిర్మయి పాల్గొన్నారు.