మాచర్ల్ల : తక్కువ ఖర్చుతో పేదల ఆకలిని తీర్చేందుకు నాణ్యమైన ఆహరం అందించేందుకు ఆహా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ మాచర్ల చిన ఏసోబు, కమిషనర్ ఇవి రమణబాబు అన్నారు. స్థానిక కూరగాయల మార్కెట్ దగ్గర గురువారం సాయంత్రం ఆహా క్యాంటీన్‌ను చిన ఏసోబు, ఇవి రమణబాబు కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాచర్ల టౌన్‌కు వివిధ గ్రామాల నుండి ప్రజ లు తమ అవసరాల కోరకు పెద్ద సంఖ్యలో వస్తుంటారని, వారు ఆకలితో ఇబ్బంది పడకుండా ఉండేందుకు మెప్మా సహకారంతో ఆహా క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్వాక్రా గ్రూప్ సభ్యులు తమ ఇళ్ళ వద్ద పులిహోర, పెరుగు అన్నం, రైసు, కర్రీలు తయారు చేసుకోని తక్కువ ధరకు నాణ్యమైన ఆహారంగా అందిస్తారని వివ రించారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాంటీన్ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ క్యాంటీన్ సేవలను సద్వినియోగం చేసుకోవా లన్నారు. కార్య క్రమంలో మెప్మా, డ్వాక్రా ప్రతినిధులు సుబ్బారావు, అంజిలి పాల్గొన్నారు.










