టివిఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి-కావలి : పట్టణంలోని గుండెమడకల దేవదానం హాస్పిటల్‌లో టి.వి.ఎస్. మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తోట.వెంకటేశ్వర్లు అధ్యక్షతన బుధవారం జరిగిన సభ్యుల సమావేశంలో డాక్టర్. ఎన్. ప్రభాకర్‌నాయుడు, ట్రస్ట్ వార్షిక క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌నాయుడు మాట్లాడుతూ ట్రస్ట్‌చైర్మన్ తోట.వెంకటేశ్వర్లు ఈ ట్రస్ట్‌ను వారి తండ్రి జ్ఞాపకార్థం 2019వ సంవత్సరంలో స్థాపించారన్నారు. అప్పటినుండి అప్రతిహతంగా, నిరంతరం కావలి, పట్టణ పరిసర ప్రాంతాలలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారన్నారు. కోవిడ్ కష్టకాలంలో వలస కార్మికులకు ఆహారం అందించడం చేస్తున్నారన్నారు. కోవిడ్ కాలంలో భౌతిక దూరం పాటించడానికి చిహ్నంగా ఆర్‌టిసి బస్టాండ్ వద్ద గొడుగులు పంపిణీ చేయడం, హాస్టల్ విద్యార్థులకు 10వ తరగతి మెటీరియల్ అందించడం చేపట్టారన్నారు. పేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం, వికలాంగులకు స్ట్రక్చర్స్ అందజేయడం, వయోవృద్ధులకు దుప్పట్ల పంచడం మొదలగు అనేక సేవా కార్యక్రమాలను నిర్వ హించారని తెలియజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ గాదిరెడ్డి.హరనాథ్, కోశాధికారి వేములపాటి.మాధవ, బీస్ గౌరవాధ్యక్షులు నాగిశెట్టి.శ్రీనివాసరావు, కావలి స్వచ్ఛంద సంస్థల గౌరవాధ్యక్షులు ఎస్.కె.ఖాదర్ బాషా, తదితరులు పాల్గొన్నారు.










