ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : టిడ్కో ద్వారా రూ.12 కోట్లతో నాలుగు నెలల్లో తాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ తెలిపారు. మంగళవారం టిడ్కో హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న 768 గృహాలకు, పట్టణ ప్రజలకు పూర్తి స్థాయిలో మంచి నీటి సరఫరా అందించే దిశగా తోటపల్లి ప్రాజెక్ట్ కుడి కాలువ వద్ద జరుగుతున్న పనులను టిడ్కో, మునిసిపల్ అధికారులతో కలిసి టిడ్కో ఛైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడ్కో సహకారంతో రూ.12 కోట్లతో భారీ మంచినీటి సరఫరా పథకం ద్వారా అందుబాటులోకి 50 లక్షల లీటర్ల నీళ్లు తద్వారా పార్వతీపురానికి తీరనున్న మంచినీటి కొరత, ఇంతటి బృహత్తర పథకంలో జరుగుతున్న సర్వే పనులను పరిశీలించారు. కార్యక్రమంలో టిడ్కో ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ జ్యోతి, డిఇఇ బాలకృష్ణారెడ్డి, శశిధర్, అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ ఇంజనీర్లు, అడ్డాపుశిల సర్పంచ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.










