Nov 11,2023 19:35

మాట్లాడుతున్న సూర్యనారాయణ చార్యులు

ప్రజాశక్తి - మంత్రాలయం
టిటిడి ధార్మిక సభ్యులుగా తనకు అవకాశం కల్పించారని పాత్రికేయులు సూర్య నారాయణ చార్యులు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడారు. టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ఈనెల 14, 15, 16, 17న మంత్రాలయంలోని శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో గోపూజ, కుంకుమార్చన, శ్రీమద్రామాయణం, శ్రీమద్భగవద్గీత ప్రవచనాలు, భజనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహకులు డాక్టర్‌ మల్లు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తన నేతృత్వంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగుతున్నట్లు చెప్పారు. శ్రీరాఘవేంద్ర స్వామి మఠం అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ మాధవ శెట్టి, మేనేజర్‌ ఎస్‌కె.శ్రీనివాసరావు, సర్పంచి భీమయ్య, వైస్‌ ఎంపిపి పులికుక్క రాఘవేంద్ర, శంకర్‌ స్వామి, ఆలయ అర్చకులు భీమాచార్యులు, రమణయ్య, మధుసూధనాచర్యులు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశామని తెలిపారు.