Aug 29,2023 20:39

మాసినిమా బాబును సన్మానిస్తున్న నాయకులు

  కడప వైసిపి గల్ఫ్‌ కన్వీనర్‌ బి.హెచ్‌. ఇలియాస్‌ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా నియామకమైన ఆర్‌. వెంకట సుబ్బారెడ్డి (మాసీమ బాబు), సిద్దవటం యానాదయ్య మంగళవారం కడప నగరంలోని నూర్జహాన్‌ కల్యాణమండపంలో ఘనంగా సన్మానించారు. గల్ఫ్‌ కన్వీనర్‌, కువైట్‌ రెడ్డీస్‌ వెల్ఫేర్‌ సంఘం సలహాదారులు గజ్జల నరసారెడ్డి, కడప ఎన్‌ఆర్‌ఐ గ్రూప్‌ సభ్యులు షేక్‌ అన్సార్‌ , బాబుబారు, షేక్‌ గయాజ్‌, షేక్‌ ఉస్మాన్‌, ఎర్రు మల్లికార్జున రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో షేక్‌ జిలాన్‌, యం . హనుమంతు, రాజాసాబ్‌, అబ్దుల్‌ రౌఫ్‌ , ఫారూఖ్‌, ఎన్‌ ఆర్‌ఐలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులైన మాసిమా బాబు మంగళవారం ఆయన నివాసంలో వైసిపి కడప నియోజకవర్గ సీనియర్‌ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి అఫ్జల్‌ ఖాన్‌ మర్యాదపూర్వకంగా కలిసి విశ్వగుచ్చం అందజేసి చాలువాతో సన్మానించారు. అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ కమల్‌బాష, పాల్గొన్నారు. కడప అర్బన్‌ : అంకితభావంతో పనిచేసిన ప్రతి కార్యకర్తకు ఉన్నత పదవులు దక్కుతాయని పవన్‌ కన్స్ట్రక్షన్స్‌ ఆమంచి నాగరాజు అన్నారు. మంగళవారం టిటిడి బోర్డు మెంబర్‌ గా నియమితులైన మాసిమబాబును ఆయన నివాసంలో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. . కార్యక్రమంలో శ్రీకాంత్‌ రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, రూక అశోక్‌ రెడ్డి, సుబ్బన్న పాల్గొన్నారు.