Aug 22,2023 21:33

ఫొటో : తిరుపతయ్యను సన్మానిస్తున్న నాయకులు

తిరుపతయ్యకు సత్కారం
ప్రజాశక్తి-సీతారామపురం : మారంరెడ్డిపల్లి ప్రాథమిక సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైన రామిశెట్టి తిరుపతయ్యను స్థానిక సొసైటీ కార్యాలయంలో చిన్ననాగంపల్లి సర్పంచ్‌ మునగల రామచంద్రారెడ్డి కలిశారు. రామిశెట్టి తిరుపతయ్యకు శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మండల వైసిపిలో అందరి నాయకులతో సత్సంబంధాలు మంచి పరిచయాలు కలిగిన వ్యక్తి రామిశెట్టి అని ఆయనకు సొసైటీ చైర్మన్‌ పదవి రావడం సంతోషమన్నారు. చిన్ననాంగంపల్లి పంచాయతీ పరిధిలోని రైతుల అభివృద్ధికి సొసైటీ తరఫున సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సీనియర్‌ వైసిపి నాయకుడు దుగ్గిరెడ్డి చిన్న కొండారెడ్డి, మాజీ వైసిపి మండల కన్వీనర్‌ పాణ్యం రమణయ్య, మాలకొండయ్య పాల్గొన్నారు.